Friday 19 July 2013

Telangana Theermanam Theenmaar

Theermanam Theenmaar
తీర్మానం తీన్‌మార్
congress-హస్తిన కాంగ్రెస్‌లో ఊపందుకున్న టీ కార్యాచరణ
నెలాఖరుకు సీడబ్ల్యూసీ సమావేశానికి కసరత్తు

28న సీడబ్ల్యూసీ సమావేశం జరిగే అవకాశం.. ఏఐసీసీ కంట్రోల్ రూం నుంచి సభ్యులకు ఫోన్లు?
అసెంబ్లీలో తీర్మానానికి విధి విధానాలేంటి.. అడ్డంకులు అధిగమించడానికి ఏం చేయాలి?
సభ, సభ్యుల ‘టీ’ మూడ్ ఎలా ఉంది?.. స్పీకర్ నాదెండ్ల నుంచి నేరుగా సమాచార సేకరణ
సోనియా, షిండే, దిగ్విజయ్‌ల భేటీల సారాంశమిదే!..
అధిష్ఠానం నిర్ణయమే ఫైనలంటున్న కాంగ్రెస్ నేతలు.. తెలంగాణకు వ్యతిరేకం కాదన్న చంద్రబాబు
భారీ తేడాతో తీర్మానం నెగ్గే అవకాశం.. ఆ బాధ్యత కాంగ్రెస్, టీడీపీదేనన్న టీ వాదులు
తేలనున్న వైఎస్సార్సీపీ అసలు రంగు


న్యూఢిల్లీ, హైదరాబాద్, జూలై 18 (టీ మీడియా):తీర్మానం.. ఎవరూ అడ్డుకోలేని విధంగా.. ఎవరూ ఇబ్బందులు కల్గించని రీతిలో! తెలంగాణ విషయంలో సీడబ్ల్యూసీ తీసుకునే కీలక నిర్ణయం అనంతరం రాష్ట్ర అసెంబ్లీని పలకరిస్తుందని చెబుతున్న విభజన తీర్మానం సాఫీగా ఆమోదం పొందేందుకు.. హస్తినలో ఇప్పుడు కీలక కసరత్తు సాగుతోంది. రాష్ట్ర విభజనపై తీసుకునే నిర్ణయంతో తలెత్తే పర్యవసానాలు ఎంతటివైనా ఎదుర్కొంటామని ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. ఆ దిశగా తన కార్యాచరణను వేగవంతం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నెల 28న జరుగుతుందని భావిస్తున్న కాంగ్రె స్ వర్కింగ్ కమిటీలో తెలంగాణపై తుది నిర్ణయం ప్రకటించే దిశగా లోతైన కసరత్తును ముమ్మరం చేసింది. రానున్న పార్లమెంటు సమావేశాలకు ముందే విభజనపై కార్యాచరణ ప్రణాళికకు తొలి రూపం ఇవ్వనున్నట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.

స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ బుధ, గురువారాల్లో జరిపిన సమావేశాలు ఈ క్రమంలోనే అత్యంత ప్రాధాన్యం కలిగినవని పేర్కొంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన వివిధ ప్రాంతాల నాయకులతో సమావేశాలు, సంప్రదింపుల ప్రక్రియ సుదీర్ఘంగా నడిచింది. ఇటీవల కోర్‌కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలతో రోడ్‌మ్యాప్‌లు తెప్పించుకున్న అధిష్ఠానం ఈ క్రమంలో స్పీకర్‌తో జరిపిన సమావేశాలు రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి చివరివని ఏఐసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సీడబ్ల్యూసీలో తెలంగాణపై సానుకూల నిర్ణయం ప్రకటించాక విభజన విషయంలో అసెంబ్లీ స్థాయిలో చేపట్టాల్సిన ప్రక్రియ, సభలో రాజకీయ పార్టీల ప్రస్తుత వైఖరులు, ప్రత్యేకించి అందులోని రెండు ప్రాంతాల నాయకుల అభివూపాయాలు, మొత్తంగా సభ మూడ్ ఎలా ఉంది? ప్రతిబంధకాలు ఎదురైతే వాటిని ఎలా అధిగమించాలి? అన్న విషయాల్లో లోతైన అవగాహన పెంపొందించుకునేందుకు మేడం నేరుగా స్పీకర్‌ను పిలిపించారని తెలుస్తోంది. రాజీనామాలు చేసేందుకు సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నాయకులు సిద్ధపడుతారన్న సంకేతాలు ఉన్న నేపథ్యంలో.. ప్రధానంగా ఈ అంశంపైనే చర్చలు జరిగినట్లు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.

కామన్ ప్రిసైడింగ్ అధికారుల సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీలో ఉన్న స్పీకర్‌తో పనిలోపనిగా సోనియాగాంధీ, షిండే గురువారం సమావేశమయ్యారు. రాష్ట్ర ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను మనోహర్ బుధవారమే కలిసిన సంగతి తెలిసిందే. మనోహర్ మాత్రం తన భేటీల వివరాలను మీడియాతో పంచుకునేందుకు తిరస్కరించినప్పటికీ.. ఈ ముగ్గురు కీలక నాయకులతో సంప్రదింపులన్నీ తెలంగాణ ఏర్పాటు దిశగానే జరిగినట్లు సమాచారం. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత సీమాంధ్ర ప్రాంత ప్రజా ప్రతినిధులు చేసిన రాజీనామాల ప్రహసనంపై సోనియాగాంధీ ముఖ్యంగా దృష్టి సారించినట్లు సమాచారం. రాష్ట్ర విభజన విషయంలో అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడంలో స్పీకర్‌దే కీలక పాత్ర. ఒక వేళ రాజీనామాలు ఎదురైతే అప్పుడు ఆయన బాధ్యత మరింత ఉంటుంది. 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు చెందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలు 130 మంది రాజీనామాల ప్రహసనానికి తెరతీశారు. వాస్తవానికి అవేవీ ఆమోదయోగ్యమైన, స్పీకర్ నమూనాలో లేనప్పటికీ.. ప్రభుత్వం ఏమైపోతుందోనన్న గగ్గోలు రేగింది. అప్పట్లో స్పీకర్‌గా ప్రస్తుత సీఎం కిరణ్‌కుమార్‌డ్డి ఉన్నారు. ఆ రాజీనామాలు చెల్లని ఫార్మాట్‌లో ఉన్న విషయాన్ని నాటి స్పీకర్ వెంటనే ప్రకటించలేదు.

20 రోజుల తర్వాత అవి చెల్లవంటూ తిరస్కరించారు. కానీ.. అప్పటికే తెలంగాణకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కేంద్రం తెలంగాణ ఏర్పాటుపై వెనుకడుగు వేసింది. ఈ అంశాన్ని పలువురు టీ కాంగ్రెస్ నాయకులు గతంలో చాలాసార్లు సోనియా దృష్టికి తీసుకు తెలంగాణ ఉద్యమకారులు కూడా ఈ అంశాన్ని పదేపదే ప్రస్తావించారు. ఈ విషయంలో అధిష్ఠానం మనోభావాలకు వ్యతిరేకంగా అప్పటి స్పీకర్ అత్యుత్సాహంతో వ్యవహరించారనే భావనతో సోనియా ఉన్నట్లు సమాచారం. అప్పుడు స్పీకర్ వ్యవహారాన్ని పసిగట్టలేకపోవడం వల్ల పార్టీకి అప్రతిష్ఠ మిగిలిందనే భావనతో మేడం ఉన్నట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. స్వపక్ష, విపక్ష ప్రజావూపతినిధులు చేసిన రాజీనామాలను అప్పటి స్పీకర్ నిష్పాక్షికంగా పరిశీలించి, అవి బోగస్ రాజీనామాలని అప్పుడే తేల్చేసి ఉంటే.. సరిపోయేదని, కానీ.. ఆయన స్పీకర్‌గా తన విచక్షణను దుర్వినియోగం చేశారని తెలంగాణవాదులు ఆరోపిస్తూనే ఉన్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబుతో మంతనాలు, ఓ రహస్య ఒప్పందం అనంతరమే చెల్లని ఫార్మాట్‌లో సీమాంధ్ర నాయకులు ఈ ప్రహసనం నడిపారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఈ విషయాలన్నీ సోనియా దృష్టిలో ఉన్నందువల్లే ముందు జాగ్రత్త చర్యగా ఆమె స్వయంగా స్పీకర్‌తో భేటీ జరిపి.. తనకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారని సమాచారం. తెలంగాణపై తీర్మానం విషయంలో ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపర్చే అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగ విధానాలకు విరుద్ధంగా రాష్ట్ర అసెంబ్లీ సమావేశం కావడం కుదరదనే విషయాన్ని మేడమ్‌కు నాదెండ్ల వివరించినట్లు తెలిసింది. రాష్ట్రపతి సిఫారసులు లేకుండా అసెంబ్లీ సమావేశం కావడం ప్రస్తుతం వీలుపడదని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. దీంతో రాష్ట్రపతి సిఫారసుల మేరకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు స్పీకర్ పాత్ర, ఆయన విచక్షణాధికారాలను కాంగ్రెస్ అధిష్ఠానం మనోభావాలకు అనుకూలంగా వినియోగించడంపైనా సమాలోచనలు జరిగినట్లు సమాచారం. ఈ విషయంలో స్పీకర్‌కు సోనియా పలు సూచనలు చేసినట్లు తెలిసింది. ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపించారు. గతంలో మాయవతి ప్రభుత్వం ఉత్తరవూపదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపించింది. ఇదే కోవలో రాష్ట్ర అసెంబ్లీ నుంచి తీర్మానాన్ని కేంద్రం ఆశిస్తోంది.

ప్రస్తుతం ఆంధ్రవూపదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగడం లేదు. కనుక ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానం ప్రవేశపెట్టడం తప్ప మరో మార్గం లేదని పార్టీ వర్గాలంటున్నాయి. దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం పెట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించే అవకాశం ఉంది. లేదా తెలంగాణ ఆంశానికి సంబంధించిన ఫైలు రాష్ట్రపతి భవన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందేవరకు వేచి చూడాల్సి ఉంటుంది. అయితే సీడబ్ల్యూసీలో నిర్ణయం తర్వాత అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టడమే ఉత్తమమని కొందరు విశ్లేషకులు అభివూపాయపడుతున్నారు. అసెంబ్లీలో తీర్మానం వీగిపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదని, విభజన ప్రక్రియ పూర్తి చేయడానికి కేంద్రానికి పూర్తి అధికారాలుంటాయని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి సభలో తెలంగాణ తీర్మానం సందర్భంగా సహకరిస్తారా? లేదా? అని కోణంలో కూడా కాంగ్రెస్ అధిష్ఠానం తమ దూతల ద్వారా ఆరా తీస్తున్నట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం.

అటో ఇటో తేల్చేస్తాం: షిండే
తెలంగాణ విషయాన్ని త్వరలోనే అటో ఇటో తేల్చేస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే స్పష్టం చేశారు. అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ విషయంలో నేతలు ప్రధానితో సహా కాంగ్రెస్ అధిష్ఠాం పెద్దలందరినీ కలుస్తున్నారు. తెలంగాణ వ్యవహారం పరిశీలనలోనే ఉన్నది’ అని తెలిపారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టే అవకాశాలున్నాయా అనే ప్రశ్నకు ‘దానికి సంబంధించిన నిర్ణయాన్ని అధిష్ఠానం పెద్దలు తీసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ విషయాన్ని ఆధిష్ఠానం త్వరలోనే అటో ఇటో తేల్చేస్తుంది’ అని స్పష్టం చేశారు.

తీర్మానం వస్తే.. పార్టీల సంగతేంటి?
అసెంబ్లీలో తెలంగాణ (రాష్ట్ర విభజనకు) తీర్మానం వస్తే ప్రధాన పార్టీలు ఏం చేస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీఎం, పీసీసీ చీఫ్‌లు పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులు పలువురు సైతం ఇదే అభివూపాయాన్ని ప్రకటించారు. సోనియా తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకించబోమని చెప్పారు. మరోవైపు టీడీపీ ఇప్పటికే తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని విస్పష్టంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీలు ఎట్టిపరిస్థితుల్లోనూ తీర్మానం ఆమోదం పొందేందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఉద్యమకారులు అంటున్నారు. ఇక కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని, తమ చేతిలో ఏమీ లేదని దాట వేస్తూ వచ్చిన వైఎస్సార్సీపీ ఏం చేస్తుందన్నది ప్రశ్న.

చిన్న రాష్ట్రాలతో కాంగ్రెస్‌కు జాతీయ స్థాయిలో లబ్ధి!
చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉన్న సీట్ల కంటే 80 సీట్లు అదనంగా వస్తాయని ఇటీవల ఆ పార్టీ దేశవ్యాప్తంగా చేయించిన ఒక సర్వేలో తేలినట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణపై దేశవ్యాప్తంగా చర్చ జరిగిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడంద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన వాళ్లమవుతామని, ఇది దేశవ్యాప్తంగా ఒక సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుందని అధిష్ఠానం ఆలోచిస్తున్నదన్న అభివూపాయాలు వినిపిస్తున్నాయి.

Google: Indianpress365days provides the latest News time to time for your better entertainment , Don’t forget keep watch this website again and again, All Daily News Papers (Eenadu, Sakshi, Andhra Jyothi, Andhra Bhoomi, Andhra Prabha, Namasthe Telangana, Vaartha, Praja Shakthi, Vishalandra, Surya) in one site, All the best my visitors http://indianpress365days.blogspot.in/

 Disclaimer  http://indianpress365days.blogspot.in/ is not responsible for any inadvertent error that may have crept in the News being published on NET. The News published on net are for the immediate information to the visitors. This does not constitute to be a legal document. While all efforts have been made to make the information available on this website as authentic as possible, Indianpress365days or any staff persons will not be responsible for any loss to persons caused by any shortcoming, defect or inaccuracy in the information available on website.

No comments:

Post a Comment

Select Your Language

Search This Blog