Wednesday 31 July 2013

Agraandhra band on yesterday

Agraandhra band on yesterday, Andhra band yesterday, telangana issues, Telangana latest news updates, 

ఆగ్రహాంధ్ర

హైదరాబాద్, జూలై 31: ఒక భాషగా, ఒక జాతిగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేయడంపై సీమా ంధ్ర భగ్గుమంది. ఇదేమి 'ఇటలీ న్యాయం?' అంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోని యాగాంధీని నిలదీసింది. తెలుగుతల్లి కంట రక్తకన్నీరు పెట్టిస్తున్నారంటూ మండిపడింది. మొన్నటిదాకా తెలంగాణలో కనిపించిన రాళ్లవర్షం, లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగంతోపాటు బలిదానాలు ఇప్పుడు సీమాంధ్రలోనూ మొదలయ్యాయి. బుధవారం రాయలసీమ, కోస్తాంధ్ర ధర్నాలు, నిరసనలు, దిష్టిబొమ్మల దహనాలతో భగ్గుమన్నాయి. విద్యార్థి, ఉద్యోగ, వ్యాపారవర్గాలు ప్రారంభించిన 72 గంటల బంద్ తొలిరోజు సంపూర్ణంగా జరిగింది.

అనంతపురం జిల్లాకేంద్రంతోపాటు కదిరి పట్టణం లో ఆందోళనకారులు రాష్ట్రం ముక్కలవడానికి ఇందిర, రాజీవ్‌ల వారసత్వమే కారణమంటూ ఇందిర విగ్రహాల మెడలో పాతటైర్లు వేసి నిప్పంటించి, విగ్రహాలను కూ ల్చివేశారు. రాజీవ్ విగ్రహాన్ని పెకలించి మెడకు తాడు బిగించి ఈడ్చుకుంటూ వెళ్లి ఇందిర విగ్రహం పక్కనే పడేశారు. ప్రధాన రహదారుల్లోని పలు దుకాణాల అ ద్దాలు, బోర్డులను ధ్వంసం చేశారు. డివైడర్లను తొలగించారు. ఐదు ఆర్టీసీ బస్సుల ను ధ్వంసం చేశారు. కాంగ్రెస్, బీజేపీ కార్యాలయాలు, ఎమ్మార్వో ఆఫీసుపై దాడికి దిగారు. అడ్డుకోబోయిన పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఎస్పీ శ్యాంసుందర్, ఏఎస్పీ నవదీప్‌సింగ్‌తోపాటు కొందరు పోలీసులు గాయ పడ్డారు. దీంతో వారు రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయుగోళాలు ప్రయోగించారు.

సుమారు ఐదుగంటలపాటు ఈ 'యుద్ధం' సాగింది. మడకశిరలో మంత్రి రఘువీరా ఇంటిని ముట్టడించి రాజీనామాకు డిమాండ్ చేశారు. 'కాంగ్రెస్ నిర్ణయం విచారకరం. తల్లి చనిపోయిన బా ధలో ఉన్నాను. నాలుగు రోజుల్లో స్పందిస్తాను' అని ఆయన చెప్పడంతో శాంతించారు. కదిరిలో పంచాయతీరాజ్ కార్యాలయం, రిలయన్స్ ఇన్సూరెన్స్ ఆఫీసుపై దాడి చేశారు. శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలో ఒక ప్రొఫెసర్, ఇద్దరు విద్యార్థులు ఆమరణ దీక్ష ప్రారంభించారు. ధర్మవరంలో వేలాదిగా కిలోమీటరు పొడవున రైలు పట్టాలపై బైఠాయించి, రాత్రి 8 గంటలవరకు రైళ్లను అడ్డుకున్నారు.


కడప: కడప జిల్లాలోని 8 డిపోల నుంచి ఒక్కటంటే ఒక్క ఆర్టీసీ బస్సు కూడా కదల్లేదు. సాయంతం 5 గంటలదాకా సంపూర్ణంగా బంద్ జరిగింది. అన్నివర్గాల వారు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. రెండు ఏటీఎంల అద్దాలు ధ్వంసం చేశారు. పలుచోట్ల సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఒక వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి దూకుతానని హెచ్చరించడంతో రెండుగంటలపాటు ఉద్రిక్తత ఏర్పడింది. అతని ఆరేళ్ల కుమారుడు 'నువ్వు దూకితే నేనూ దూకుతా' అనడంతో దిగివచ్చాడు. జేఏసీ కన్వీనర్ రామచంద్రారెడ్డి ఆమరణ దీక్షకు పలువురు మద్దతు తెలిపారు.
చిత్తూరు: పంచాయతీ ఎన్నికలున్న చోట మినహా... జిల్లాలో బంద్ సంపూర్ణంగా జరిగింది.

తిరుమలకు తప్ప జిల్లాలో ఇతర ప్రాంతాలకు బస్సులు ఆగిపోయాయి. తిరుపతిలో గాంధీ విగ్రహం వద్ద వైసీపీ కార్యకర్తలు ఓ కారును దహనం చేశారు. ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి నిరశన చేపట్టారు. ఎస్వీ, మహిళా వర్సిటీల విద్యార్థులు బంద్‌లో పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు గ్యారేజీలో వంటావార్పు నిర్వహించారు. చిత్తూరులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయలేదు. చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు గురువారం నుంచి 48గంటల నిరాహారదీక్ష చేస్తాన ని ప్రకటించారు. మదనపల్లెలో చేనేత కార్మికులు ముంబై-చెన్నై జాతీయ రహదారిపై మూడుగంటలు ధర్నాచేశారు. బంద్‌వల్ల వివిధ ఆలయాల్లో భక్తుల రద్దీ తగ్గింది.

కర్నూలు: కర్నూలు నుంచి డోన్‌దాకా బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకోలతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఆత్మకూరులో ఉద్యమకారులు మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటిని ముట్టడించి అద్దాలను బద్దలుకొట్టారు. నంద్యాలలో కాంగ్రెస్, వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. డోన్‌లో ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తి నివాసాన్ని ముట్టడించారు. బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు. ఎమ్మిగనూరులో గురువారం పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. బస్సులు తిరగకపోవడంతో శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ తగ్గిపోయింది.

బెజవాడ: విజయవాడలో ఎన్జీవోలు, ఆర్టీసీ, విద్యుత్తు, ఉడా ఉద్యోగులు, విద్యార్థులు, న్యాయవాదులు కదంతొక్కారు. యూత్ కాంగ్రెస్ నేత దేవినేని అవినాశ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ సాగింది. పలు సెంటర్లలో రాస్తారోకో చేశారు. ఆర్టీసీ బస్సులను అడ్డుకునేందుకు యత్నించిన ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభు త్వ కార్యాలయాల్లో పనులు స్తంభించాయి.

గుంటూరులో: ఉదయం ఆరుగంటల నుంచే ఉద్యమకారులు బస్సులను అడ్డుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బ్యాంకులు, దుకాణాలు, సినిమా హాళ్లు అన్నీ మూతపడ్డాయి. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మస్తాన్ వలి ఆధ్వర్యంలో కార్యకర్తలు సోనియా చిత్రం ముద్రించిన కాంగ్రెస్ జెండాలతోనే ఆందోళనల్లో పాల్గొన్నా రు. సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ శామ్యూల్, గౌరవాధ్యక్షుడు నరసింహారావు ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో విద్యార్థులు ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ బంద్ నిర్వహి ంచారు. పొన్నూరులో టీడీపీ శ్రేణులు కూడా బంద్ నిర్వహించాయి.

ఏఎన్‌యూ విద్యార్థులు జాతీయ రహదారిపై ధర్నాచేశారు. ఏపీఎన్జీవో సంఘం ప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. పెట్రోల్ డీలర్ల సంఘం ప్రతినిధు లు కూడా బంద్‌లో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ప్రైవేటు బీఈడీ కళాశాలల సం ఘం గురువారం నుంచి 8వ తేదీ వరకు బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది.

తూర్పు గోదావరి: రాజమండ్రిలో విభజనకు మీరంటే మీరే కారణమంటూ టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ వర్గాలు దు మ్మెత్తి పోసుకున్నాయి. పట్టణంలోని అన్నివర్గాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. థియేటర్లు కూడా మూ తపడ్డాయి. వైసీపీ కార్యకర్తలు కాం గ్రెస్ ఆఫీసు ముందు ఎంపీ ఉండవల్లి దిష్టిబొమ్మను దహనం చేశారు. దీం తో అక్కడ ఘర్షణ జరిగింది.

ఆర్డీవో, పీఎఫ్, బీమా కంపెనీ కార్యాలయాలపై ఉద్యమకారులు దాడికి దిగి అ ద్దాలు ధ్వంసం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను సోనియాగాంధీ రంపంతో కోస్తు న్న చిత్రాన్ని నగరంలో ప్రదర్శించారు. విభజన జరిగితే కాం గ్రెస్‌కు పుట్టగతులుండవని కాకినాడలో ఎమ్మెల్యే గాంధీమోహన్ మండిపడ్డా రు. రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. పిఠాపురంలో స్టేట్ బ్యాంక్, ఒక మద్యం దుకాణంపై దాడికి దిగారు. జిల్లావ్యాప్తంగా 20 బస్సులను ధ్వంసం చేశారు. ఒక డ్రైవర్, మరొక ప్రయాణికుడు గాయపడ్డారు. ఆర్టీసీకి రూ.55 లక్ష ల వరకు నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.

పశ్చిమ గోదావరి: జిల్లాలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ఏలూరులో వీధులన్నీ నిర్మానుష్యమయ్యాయి. ఉద్యోగ, విద్యార్థి సంఘాలతోపాటు కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెంతోపాలు పలు మండల కేంద్రాల్లో రాస్తారోకో, మానవహారం, ధర్నా తదితరాలు నిర్వహించారు. ఓ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు.

ప్రకాశం: జిల్లాలో విద్యార్థి జేఏసీతోపాటు వైసీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఒంగోలులో బీజేపీ కార్యాలయంపై దాడికి దిగారు. నిరసనలు తీవ్రస్థాయిలో జరిగినా బంద్ మాత్రం పాక్షికంగా జరిగింది. పోలీసులు భారీగా మోహరించి శాంతిభద్రతలను పర్యవేక్షించారు.

నెల్లూరు: బంద్ ప్రశాంతంగా జరిగింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి సమైక్య నినాదాలతో సోనియా దిష్టిబొమ్మలను తగలబెట్టారు. నెల్లూరులో పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. నాడు రాష్ట్ర సాధనకు పోరాడిన యోధులు కంటతడిపెట్టారు. విద్యార్థి జేఏసీ రైలురోకో నిర్వహించింది. మం త్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేశాకే నెల్లూరు గడ్డపై అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు.

విశాఖపట్నం: విశాఖలో బంద్ సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. ఆర్టీసీ 26 0 బస్సులను నిలిపివేసింది. ఆంధ్ర వర్సిటీలో విద్యార్థి జేఏసీ నేతల ఆమరణ దీక్షకు కాంగ్రెస్, వైసీపీ నేతలు సంఘీభావం ప్రకటించారు. ఆందోళనలు మరింత తీవ్రంచేయాలని, సంపూర్ణంగా సహకరిస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో సమైక్యవాదాన్ని వినిపించడం కోసమే రాజీనామా చేయలేదని ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ తెలిపారు. విద్యార్థి నేతలు ద్రోణంరాజు శ్రీనివాస్ కాళ్లపైపడి సమైక్యాంధ్రకు మద్దతు కోరారు. విద్యార్థి జేఏసీ కన్వీనర్ ఆడారి కిశోర్ కుమార్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

విజయనగరంలో...: జిల్లాలో అన్నివర్గాలవారు బంద్‌లో పాల్గొన్నారు. లాయర్లు జిల్లాకోర్టు ప్రధాన ద్వారానికి తాళంవేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, బడ్డుకొండ అప్పలనాయుడు, జనార్దన్ థాట్రాజ్, సవరపు జయమణి, ఎమ్మెల్సీలు కోలగట్ల వీరభద్రస్వామి, గాదె శ్రీనివాసులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. రాజీనామాకు సిద్ధమని, స్పీకర్ ఫార్మాట్‌లో సంతకం చేసి ఉంచుకున్న పత్రాలను చూపించారు.

శ్రీకాకుళం: జిల్లాల్లో నేతలు పట్టి ంచుకోకపోయినా విద్యార్థి, ఉద్యోగ, సమైక్యాంధ్ర జేఏసీ ప్రతినిధులు గర్జించారు. యూపీఏ ప్రభుత్వం, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. వివిధ పట్టణాల్లో ర్యాలీలు సాగాయి. టెక్కలి డివిజన్‌లో పంచాయతీ ఎన్నికలున్నా ఉద్యమ వేడి తగ్గలేదు.

ఆగిన చక్రాలు
సీమాంధ్ర బంద్ కారణంగా హైదరాబాద్‌కు రావాల్సిన బస్సులు ఆగిపోయాయి. ప్రధానంగా... కర్నూలు సెక్టార్ నుంచి బస్సులు నిలిచిపోయాయి. సీమాంధ్ర జిల్లాల నుంచి రోజుకు 2300 బస్సులు రావాల్సిఉండగా... బుధవారం 1900 బస్సులు మాత్రమే వచ్చాయి. బంద్ నేపథ్యంలో బెంగళూరు, మైసూరు, కడప, అనంతపురం తదితదిర ప్రాంతాలకు వెళ్లాల్సిన సర్వీసులను రద్దు చేశారు. విజయవాడ, ఒంగోలు, నె ల్లూరు ప్రాంతాల నుంచి బస్సులు యథాతథం గా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇ క... పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన బస్సులు కూ డా ఆగిపోయాయి.

Google: Indianpress365days provides the latest News time to time for your better entertainment , Don’t forget keep watch this website again and again, All Daily News Papers (Eenadu, Sakshi, Andhra Jyothi, Andhra Bhoomi, Andhra Prabha, Namasthe Telangana, Vaartha, Praja Shakthi, Vishalandra, Surya) in one site, All the best my visitors http://indianpress365days.blogspot.in/

 Disclaimer  http://indianpress365days.blogspot.in/ is not responsible for any inadvertent error that may have crept in the News being published on NET. The News published on net are for the immediate information to the visitors. This does not constitute to be a legal document. While all efforts have been made to make the information available on this website as authentic as possible, Indianpress365days or any staff persons will not be responsible for any loss to persons caused by any shortcoming, defect or inaccuracy in the information available on website.

No comments:

Post a Comment

Select Your Language

Search This Blog