Sunday 4 August 2013

Seemandraku Golden chance

సీమాంధ్ర కు సువర్ణావకాశం
ఊహించిన విధంగానే రాష్ట్ర విభజనకు అంకురార్పణ జరిగిపోయింది. మరి కొద్ది రోజులలో బిల్లు కూడా ఆమోదం పొంది తెలంగాణ కల సాకారం కానుంది. నిజానికి కొత్త రాష్ట్రం సీమాంధ్రే అవుతుంది. పాతపేరు ఆంధ్రప్రదేశ్ కొత్తగా కాపురాన్ని చక్కదిద్దుకోవలసి ఉండగా , కొత్త పేరు తెలంగాణ లేదా హైదరాబాద్ రాష్ట్రం పేరుతో అన్ని వడ్డించిన విస్తరిలా రాష్ట్రం సిద్దం అవుతుంది.ఇంతదాకా వచ్చిన తర్వాత కాంగ్రెస్ కాని, కేంద్ర ప్రభుత్వం కాని వెనక్కి పోవడం జరుగుతుందని కొందరు నేతలు ప్రచారం చేస్తున్నా, అది నమ్మే పరిస్థితి లేదు.సీమాంద్ర నేతలు వాస్తవ పరిస్థితిని అర్ధం చేసుకుని ఇప్పుడు ఏమి చేయాలన్నదానిపై ఆలోచన చేయాలి. నిజానికి ఆంద్ర , రాయలసీమలకు ఒక అధ్బుతమైన అవకాశం. ఆ ప్రాంతం అబివృద్ది చెందడానికి వచ్చిన వరంగా భావించాలి. నిజమే. కొన్ని కష్టాలు, నష్టాలు ఉంటాయి. ఇప్పుడు ఈ పరిస్థితికి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కారణమా?చంద్రబాబు కారణమా?సోనియాగాంధీ కారణమా?లేక ఇంకా వేరే ఎవరైనా కారణమా?అన్న చర్చలో పెద్దగా ప్రయోజనం ఉండదు. అది కేవలం చరిత్రగా మిగిలిపోతోంది. ఎఐసిసి అదినేత్రి సోనియాగాంధీ ధృడ నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర నాయకులంతా బాధ్యత వహించవలసిందే.కాంగ్రెస్ హై కమాండ్ ఉన్నంతలో బెటర్ గానే నిర్ణయం చేసినట్లు కనబడుతుంది.సీమాంద్ర కేంద్ర మంత్రులు పల్లంరాజు, చిరంజీవి,కావూరి, పురందేశ్వరి, జెడి శీలం వంటివారు సోనియాగాందీని కలిసినప్పుడు ఆమె ఎలాంటి శషబిషలు లేకుండా తన అబిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారట.నిర్ణయం తీసుకున్నాక వచ్చి ఏమి చెప్పినా ఏమి చేయగలమని ప్రశ్నించారట. అదిష్టానం మాటకు కట్టుబడి ఉంటామని చెప్పారు కదా అని అన్నారట.అంతేకాదు.సీమాంధ్ర ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని, పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు మీ కోర్కెలన్నిటిని పెట్టండి , వాటిని తీర్చడానికి ప్రయత్నిస్తామని అన్నారని కదనం. సీమాంధ్ర లో కొన్ని రోజులు ఆందోళనలు ఉండవచ్చు. బిల్లు పార్లమెంటులో పూర్తి అయి, ఆ తర్వాత శాసనసభకు వచ్చి వెళ్లేంతవరకు కొంత ఉద్రిక్త వాతావరణం ఉండవచ్చు.కాని ఇప్పుడు ఇది తెలివైన పని కాదని చెప్పాలి.దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లు గా సుదీర్గకాలంగా ఉన్న డిమాండును గౌరవించడం అయి ఉండవచ్చు. అంత మాత్రాన ఇందులో రాజకీయ కోణం లేదంటే ఎవరూ నమ్మరు. అన్ని లెక్కలు వేసుకునే , ఆయా రాజకీయ పార్టీలను ఎలా దెబ్బతీయవచ్చన్న వ్యూహంతోనే తెలంగాణ ప్రకటన చేశారు. అయితే గతంలో మాదిరి కాకుండా, ఇందులో అన్ని పక్షాలను భాగస్వాములను చేయడం మంచి పద్దతే. మన రాష్ట్ర రాజకీయ నాయకులు చాలామంది లోపల ఒకటి, బయట ఒకటి చెప్పడం అలవాటైపోయింది. దాని ఫలితమే ఈ పరిణామం అని చెప్పక తప్పదు. పులి కావాలి..పులి కావాలి.. పార్టీలు అడిగితే ముందు ఆశ్చర్యపోయారు.ఆ తర్వాత ఇస్తే పోలా అనుకున్నారు. చివరికి ఇచ్చేసరికి దానిని ఎలా భరించాలో తెలియని పరిస్థితిలో రాజకీయ పార్టీలు పడ్డాయి. తెలంగాణ పాయింటుతోనే రాజకీయం నడిపిన టిఆర్ఎస్ ను కొంతమేర కుదేలు చేశారు.టిఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయడానికి సిద్దమేనని కెసిఆర్ ప్రకటించవలసి వచ్చింది. ప్రజారాజ్యం పార్టీని ఇప్పటికే కలుపుకున్న కాంగ్రెస్ పార్టీ కనుక టిఆర్ఎస్ ను కలుపుకుంటే తెలంగాణలో మరింత బలోపేతం అవుతుంది. అయితే టిఆర్ఎస్ తో సంబందం లేకుండా కాంగ్రెస్ సొంతంగా తెలంగాణ ఇస్తున్నదన్న భావన కల్పించడంలో సఫలం అయ్యారని చెప్పాలి. కిందటిసారి కెసిఆర్ ఇస్తున్నట్లు ప్రకటించడం వల్ల కాంగ్రెస్ కు బాగా నష్టం జరిగింది.ఈసారి ఆ తప్పు చేయకుండా జాగ్రత్తపడ్డారు. ఇక తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణ రావడానికి కారణమే అయినా, ఆ క్రెడిట్ వారికి పూర్తిగా దక్కే పరిస్థితి లేదు. బిజెపి ఇంకా తెలంగాణలో పుంజుకోకముందే తెలంగాణ నిర్ణయం తీసుకుంది.అయితే టిడిపి, బిజెపిలు భవిష్యత్తులో కలిసే అవకాశం ఉ ఉంటుందా అన్న చర్చ కూడా ఉంది. ఇక తెలంగాణలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కోలుకోలేని విదంగా దెబ్బతింది.ఇన్ని రకాలుగా తెలంగాణలో పైచేయిగా ఉన్న కాంగ్రెస్ సీమాంధ్రలో కొంత నష్ట పోతుంది. అయితే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వడం, హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేయడం ద్వారా మరీ ఎక్కువ నిరసన రాకుండా జాగ్రత్తపడినట్లయింది.ఇదే సమయంలో మరిన్ని సీమాంద్ర డిమాండ్లను తీర్చడానికి కాంగ్రెస్ సిద్దం కావచ్చు.పైగా అక్కడ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్, టిడిపిల మధ్య పోరులో వై.ఎస్ ఆర్.కాంగ్రెస్ ది పైచేయి అయితే అది అంతిమంగా కాంగ్రెస్ కు ఉపయోగపడవచ్చు. టిడిపి గెలిస్తే , ఆ తర్వాత కాలంలో మళ్లీ నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తుంది.ఎక్కడో ఒక చోట నష్టం తప్పదు కనుకే కాంగ్రెస్ ఈ నిర్ణయానికి సిద్దం అయింది.ఈ తరుణంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆ ప్రాంతానికి అధిక లాభం చేకూరే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలి. తొమ్మిది మంది మంత్రులు ఉన్నారు.దాదాపు జిల్లాకు ఒకరు చొప్పున ఉన్నట్లు లెక్క.అందువల్ల వారంతా పూనుకుని నిర్దిష్ట ప్రతిపాదనలతో కేంద్రం నుంచి స్కీములు సంపాదించాలి.రాజధాని ఒక చోట పెడితే , మరో చోట హైకోర్టు ఉండాలి. అలాగే అనంతపురంలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్ లు వచ్చేలా చూడాలి. తీర ప్రాంతంలో తత్సంబంధిత పరిశ్రమలు రావాలి.వాన్ పిక్ కోసం ఇప్పటికే వేల ఎకరాలు సేకరించారు. జగన్ కేసులో ఒక విధంగా చెప్పాలంటే వాన్ పిక్ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను జైలులో పెట్టి హింసిస్తున్నారు.రాజకీయంగా మారిన ఈ కేసులో సిబిఐ తీరు కూడా సరిగా లేదన్న విమర్శలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ కూడా వీరికి ఎందుకు బెయిల్ ఇవ్వడం లేదో అర్దం కాదు. ఇప్పుడు ఆయన సేకరించిన భూములు ఆ ప్రాంతంలో అబివృద్దికి ఉపయోగపడవచ్చు.రాజశేఖరరెడ్డి అవినీతి సంగతి ఎలా ఉన్నా రాయలసీమ, కోస్తా ఆంధ్రలో పోలవరం, పులిచింతల వంటి ప్రాజెక్టులు, హంద్రినీవా, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టులో చేపట్టి మంచి పనిచేశారు. ఇప్పుడు అవన్ని పూర్తి అయ్యేలా చూడవలసిన అవసరం ఉంది. అలాగే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం రావాలి. ఈసారి అబివృద్ది వికేంద్రీకరించకపోతే మళ్లీ సమస్యలు వస్తాయి.ఇప్పటికే హైదరాబాద్ లోనే అంతా కేంద్రీకరించి అనవసరంగా సమస్యలు తెచ్చుకున్నాం.ఈసారి ఆ పరిస్థితి ఉండకూడదు.సీమాంధ్ర రాష్ట్రంలో ముందుగా కొన్ని కష్టనష్టాలు ఉంటాయి. కాని కష్టపడితే భవిష్యత్తు ఉంటుంది.కాకపోతే నాయకులు ప్రజలను సానుకూల ధోరణితో ముందుకు తీసుకు వెళ్లాలి. అందుకు సరైన నాయకత్వం అవసరం.అప్పుడే సీమాంద్ర అభివృద్దికి ఆస్కారం ఉంటుంది.సంక్షోభాల నుంచే నాయకులు పుడతారు. సంక్షోభాల నుంచే అబివృద్ది మొదలవుతుంది.ఇప్పుడు దీనిని సీమాంధ్ర ప్రజలు సువర్ణావకాశంగా మార్చుకోవాలి.అనవసర విబేధాలు పెంచుకోకుండా, తెలంగాణ ప్రజలతో కలివిడిగా ఉంటూ , ఇప్పుడు రెండు రాష్ట్రాలు సమగ్రాభివృద్ది చెందడమే లక్ష్యంగా ఉండాలి.అప్పుడే ఈ విభజనకు సార్ధకత ఉంటుంది.

Google: Indianpress365days provides the latest News time to time for your better entertainment , Don’t forget keep watch this website again and again, All Daily News Papers (Eenadu, Sakshi, Andhra Jyothi, Andhra Bhoomi, Andhra Prabha, Namasthe Telangana, Vaartha, Praja Shakthi, Vishalandra, Surya) in one site, All the best my visitors http://indianpress365days.blogspot.in/

 Disclaimer  http://indianpress365days.blogspot.in/ is not responsible for any inadvertent error that may have crept in the News being published on NET. The News published on net are for the immediate information to the visitors. This does not constitute to be a legal document. While all efforts have been made to make the information available on this website as authentic as possible, Indianpress365days or any staff persons will not be responsible for any loss to persons caused by any shortcoming, defect or inaccuracy in the information available on website.

No comments:

Post a Comment

Select Your Language

Search This Blog