కాంగ్రెస్ కొత్త నాటకాలు...
కాంగ్రెస్ పార్టీ డ్రామాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. నిన్నటిదాకా అవునని కాని, కాదు అని చెప్పకుండా మూతి ముడుచుకొని ఉన్న కాంగ్రెస్ ఒకే రోజు సి డబ్ల్యు సి, యుపిఎ సమన్వయ భేటి నిర్వహించి తెలంగాణకు అనుకూల తీర్మానాలు చేశారు.
ఇక్కడే అసలు నాటకం మొదలయ్యింది. అంతవరకు తెలంగాణకు అంగీకరిస్తున్నామని చెప్పిన సీమంధ్రులు ఉద్యమ(?) బాట పట్టారు. ఉద్యమం అంటే ఏమిటో కాదు వారి దృష్టిలో విద్వంసమే..! వారి ఆరాటం పరమార్ధం ఏమిటంటే ఎలాగో రాష్ట్రం విడిపోతుంది, వాళ్లకు దక్కని హైదరాబాద్ అవతలి వాళ్ళకు కుడా దక్కకుండా చెయ్యాలనే కుట్ర, సీమంద్ర నాయకులు హైదరాబాద్ ను తెలంగాణా ప్రజలు వదులుకొని కరీంనగర్, వరంగల్ లో ఎక్కడైనా రాజధాని పెట్టుకొమ్మని అంటున్నారు...
అయితే ఈ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా సి ఎం, ఫై సి సి చీఫ్ బుర్రల్లోనించి పుట్టిందే.. వై సి పీ కి ఉన్న అతికొద్దిమంది నాయకులూ కుడా తెలంగాణా లో కాలి అవడంతో వాళ్ళు సీమంద్ర జండా పట్టుకున్నారు, సమైక్యంద్ర కోసం రాజీనామాలు చేసి విధ్వంసాలు మొదలుపెట్టారు, ఇప్పుడు కేంద్రం గతంలో మాదిరిగా వెనక్కి వెల్లదని వాళ్ళకు కుడా తెలుసు మరి అలాంటప్పుడు ఉద్యమం ఎందుకు అంటే...2014 ఎన్నికలలో లాభం పొందాలి కదా... అలాగే వై ఎస్ అర్ చనిపోయినప్పుడు టి వి లో ఆ వార్త చూస్తూ గుండె పోటు వచ్చి మరణించారని లిస్టు తయరుచేసినట్టే, ఇప్పుడు కుడా సమైక్యంద్ర కోసం టి వి చూస్తూ మరణించారంటూ లిస్టు తయారు చేస్తున్నారు మీడియా వారు... ఇదంతా ఎన్దుకొసమంటే 2014 లో కాంగ్రెస్ మల్లి అధికారంలోకి రావాలి. వై సి పీ తో ఇప్పటికే అవగాహన కుదుర్చుకున్నారు కాబట్టే తెలంగాణా పై ప్రకటన చేసారు. 2014 లో కాంగ్రెస్ కు ఓటు వేసిన, వై సి పీ కి వేసినా అది కాంగ్రెస్ కు వేసినట్టే. ఇప్పుడు నడిపిస్తున్న ఉద్యమం ద్వారా వై సి పీ ని సీమంద్రలో బలపరచడం ద్వారా 2014 లో లాభం పొందవచ్చానేది కాంగ్రెస్ వ్యూహం ...
మరి టి డి పీ ఎం చేస్తున్నట్లు? తెలంగాణా రాకుండా చివరివరకు కాంగ్రెస్ పెద్దలకు ఫోన్లు చేస్తూ ప్రదేయ పడ్డాడట బాబు, ఒక ఆంగ్ల పత్రిక వెల్లడించిన విషయం ఇది, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నాక ప్రెస్ మీట్ పెట్టి రెండు రాష్ట్రాలు సక్యతతో ఉండాలని సీమంద్రకు 5 లక్షల కోట్ల ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి మొఖం చాటేశాడు. ఇక మిగతా పని ఆ పార్టీ సీమంద్ర నాయకులూ చూసుకుంటున్నారు, బాబు మార్గదర్శనంలో రాజీనామాలు చేసారు, ఇలాగు రాష్ట్ర ఏర్పాటు ఆగదు కాబట్టి హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయించేందుకు కృషి చేస్తున్నాడు.
మొత్తంగా అన్ని పార్టీల అసలు రంగులు బయట పడుతున్న ప్రస్తుత తరుణంలో... తెలంగాణా కాంగ్రెస్ నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయి. తెలంగాణ మేమే తెచ్చామ్, సోనియమ్మతో మాట్లాడి తెచ్చాం, కె సి అర్ నోటిని అదుపులో పెట్టుకోవాలని అంటూ, సీమందృ లపై తెగ సానుభూతి కురిపిస్తున్నరు, గడచిన 12 ఏళ్ళ ఉద్యమంలో ఒకే ఒక సభపెట్టి మేమే తెలంగాణా తెచ్చాం అని చంకలు గుద్దుకునే వారు 1000 మంది చనిపోక ముందు సోనియా తో ఎందుకు మాట్లాడి తెలంగాణా తేలేదు..? ఇవ్వాళ్ళ ఉద్యమ ఫలితమే తెలంగాణ రాష్ట్రం అంటే చిర్రు బుర్రు లాడుతున్న ఈ నాయకులు ఎప్పుడు ఉద్యమం చేసారు..? వీళ్ళు తెలంగాణా ఏర్పడే వరకూ తెలంగాణ కు వ్యతిరేఖమే, సి ఎం కు అనుకూలం, ఇంకా కొంతమైంది నాయకులైతే దిగజారి మాట్లాడి తెలంగాణా నాయకులంటే బానిస మనస్తత్వమ్ కల్గినవారని నిరూపించారు, వీళ్ళ చేతుల్లో రేపు కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రాన్ని పెడితే కుక్కలు చింపిన విస్తరిగా చేస్తారు, వీళ్ళు ఇప్పుడే కె సి అర్ ను పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు, రేపు ఉద్యమకారులను ఇలాగె పక్కకు నేట్టేస్తారేమో, తెలంగాణ ఉద్యమం ఇక్కడితో ముగుసిపోలేదు, ఈ బానిస నాయకత్వం పోయేవరకు, మనం కోరుకున్న అన్ని కోరికలు తీరేవరకు పోరాడాలి.. ఇది అంతం కాదు ఇదే నిజమైన ఆరంభం...
Disclaimer : http://indianpress365days.blogspot.in/ is not responsible for any inadvertent error that may have crept in the News being published on NET. The News published on net are for the immediate information to the visitors. This does not constitute to be a legal document. While all efforts have been made to make the information available on this website as authentic as possible, Indianpress365days or any staff persons will not be responsible for any loss to persons caused by any shortcoming, defect or inaccuracy in the information available on website.
No comments:
Post a Comment