What is lose of Telangana in AP, Telangana is sirigalla telangana there is no body can developped, Telangana is
Google:Indianpress365days provides
the latest News time to time for your better entertainment , Don’t forget keep watch
this website again and again, All Daily News Papers (Eenadu, Sakshi, Andhra Jyothi, Andhra Bhoomi, Andhra Prabha, Namasthe Telangana, Vaartha, Praja Shakthi, Vishalandra, Surya) in one site, All the best my visitors http://indianpress365days.blogspot.in/
Disclaimer : http://indianpress365days.blogspot.in/ is not responsible for any inadvertent error that may have crept in the News being published on NET. The News published on net are for
the immediate information to the visitors. This does not constitute to
be a legal document. While all efforts have been made to make the
information available on this website as authentic as possible, Indianpress365daysor any staff persons will not be responsible for any loss to
persons caused by any shortcoming, defect or inaccuracy in the
information available on website.
హైదరాబాద్, జూలై 31: 'పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం! పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా భాగ్యనగరం!'... ఇది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తేల్చిచెప్పిన విషయం! మున్ముందు జరగబోయేది కూడా ఇదే! 'ఉమ్మడి రాజధాని' అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది? అక్కడ అధికారం ఎవరిది?... అటు తెలంగాణవాదులను, ఇటు సీమాం«ద్రులనూ వేధిస్తున్న ప్రశ్నలు ఇవి! దీనిపై సీనియర్ ఐఏఎస్ అధికారులను 'ఆంధ్రజ్యోతి' సంప్రదించింది. 'ఉమ్మడి రాజధాని'కి సంబంధించిన వివరాలు రాబట్టింది. వారు చెబుతున్న విషయమేమిటంటే... రాజ్యాంగంలో ఉమ్మడి రాజధాని అనే ప్రస్తావనే లేదు. ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలని చెప్పారు కానీ... ఒకే నగరం రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉండకూడదని మాత్రం చెప్పలేదు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్ర హోదా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల గురించి స్పష్టమైన ప్రస్తావన ఉన్నా... 'ఉమ్మడి రాజధాని' అనే ప్రస్తావన మాత్రం రాజ్యాంగంలో లేదు. అందువల్ల... పైకి ఎలాంటి పేరుతో పిలిచినా, పరిపాలనాపరంగా హైదరాబాద్ పదేళ్లపాటు కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
పిట్ట పోరు... పిట్టపోరు... 'హైదరాబాద్ మాది' అని తెలంగాణవాదులు చెబుతుండగా... 'మాది కూడా' అని సీమాం«ద్రులు వాదిస్తున్నారు. ఇప్పుడు... కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి 'మీ ఇద్దరిదీ కాదు! హైదరాబాద్ మాది' అని తేల్చేయనుంది. ఎందుకంటే... ఉమ్మడి రాజధాని అనే కేంద్ర పాలిత ప్రాంతంపై ఉభయ రాష్ట్రాల్లో దేనికీ అధికారం ఉండదు. కేంద్రమే మొత్తం వ్యవహారాలు పరిశీలిస్తుంది. దీనికోసం ఒక 'అడ్మినిస్ట్రేటర్'ను నియమిస్తుంది. ఆయన హోదా... లెఫ్టినెంట్ గవర్నర్. తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో ఇరురాష్ట్రాల గవర్నర్‌లతోపాటు ఒక లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఉంటారు. అయితే, ఏదో ఒక గవర్నర్‌కే లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించవచ్చు.
లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఇక సహాయకుడు ఉంటారు. గతంలో 'చీఫ్ కమిషనర్' అని పిలిచేవారు. ఇప్పుడు 'లెఫ్టినెంట్ గవర్నర్‌కు సలహాదారు'గా ఆ హోదాను మార్చారు. ఈ సలహాదారుకు యూటీ కేడర్‌కు చెందిన ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌లు సహకరిస్తారు. వీరిలో ఒకరు శాంతి భద్రతలు, మరొకరు రెవెన్యూ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. మిగిలిన విభాగాలన్నీ వీరిద్దరి అజమాయిషీలోనే ఉంటాయి. మొత్తం మీద రాబోయే ఉమ్మడి రాజధాని పరిపాలన లెఫ్ట్‌నెంట్ గవర్నర్, ఆయన సలహాదారుడు, ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌ల చేతుల మీదుగా నడుస్తుంది. మొత్తం పరిపాలనను కేంద్రం పర్యవేక్షిస్తుంది. ఉమ్మడి రాజధాని పాలనా వ్యవహారాల్లో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకుగానీ, ఆయా రాష్ట్రాల రాజకీయ పార్టీలుగానీ వేలు పెట్టలేవు.
'పది'లమేనా? 'పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్' అని తీర్మానించారు. ఈలోపు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మించుకోవాలని కూడా తెలిపారు. అయితే... 'పదేళ్ల'పై చాలామందిలో చాలా సందేహాలున్నాయి. కారణం... చండీగఢ్ అనుభవమే! పంజాబ్ నుంచి హర్యానా రాష్ట్రాన్ని విభజించినప్పుడు చండీగఢ్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని 1966లో తీర్మానించారు. పదేళ్ల తర్వాత చండీగఢ్ పంజాబ్‌కు దక్కాలని, హర్యానా కొత్త రాజధాని నిర్మించుకోవాలని ఒప్పందం కుదిరింది. దాదాపు ఐదు దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ చండీగఢ్ ఉమ్మడి రాజధానిగా, కేంద్ర పాలిత ప్రాంతంగానే కొనసాగుతోంది.
కొత్తరాజధాని నిర్మాణం బాగా ఖర్చుతో కూడుకున్నది కావడం, హర్యానా పరిధి చిన్నది కావడం, రెండు రాష్ట్రాలకు చండీగఢ్‌తో భౌగోళిక అనుసంధానం ఉండటంతో... అలా సాగిపోతోంది! కానీ... హైదరాబాద్‌తో రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు భౌగోళిక అనుసంధానంలేదని, పదేళ్లకు మించి ఉమ్మడి రాజధానిగా కొనసాగించలేరని పలువర్గాలు చెబుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే... తొలుత చండీగఢ్‌కు కూడా హర్యానాతో భౌగోళిక అనుసంధానం లేదు. ఇలా కనెక్టివిటీ కల్పించేందుకు వీలుగా రెండు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను చండీగఢ్ పరిధిలోకి తెచ్చినట్లు సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు తెలిపారు.
జన రంజకమే... ఉమ్మడి రాజధానిగా ఉండే కేంద్ర పాలిత ప్రాంతం నుంచి వచ్చే ఆదాయంలో ఇరు రాష్ట్రాలకు వాటా ఉంటుంది. యూటీ అభివృద్ధి కోసం కేంద్రం కూడా విరివిగా నిధులు మంజూరు చేస్తుంది. దీంతో అభివృద్ధిపరంగా యూటీలు ముందంజలో ఉంటాయి. రాజకీయ అస్థిరతకు, ఆందోళనలకు తావు ఉండదు కాబట్టి... పారిశ్రామిక వర్గాలు కూడా యూటీలో పెట్టుబడులు గుమ్మరిస్తాయి. యూటీల్లో ప్రజల తలసరి ఆదాయం రాష్ట్రాలకంటే చాలా ఎక్కువ! ఇన్ని రకాల అభివృద్ధి సాధించిన ప్రాంతంలో నివసించడం మొదలుపెట్టిన ప్రజలు... యూటీ నుంచి వెళ్లిపోవాలని కోరుకోరు!
Google:Indianpress365days provides
the latest News time to time for your better entertainment , Don’t forget keep watch
this website again and again, All Daily News Papers (Eenadu, Sakshi, Andhra Jyothi, Andhra Bhoomi, Andhra Prabha, Namasthe Telangana, Vaartha, Praja Shakthi, Vishalandra, Surya) in one site, All the best my visitors http://indianpress365days.blogspot.in/
Disclaimer : http://indianpress365days.blogspot.in/ is not responsible for any inadvertent error that may have crept in the News being published on NET. The News published on net are for
the immediate information to the visitors. This does not constitute to
be a legal document. While all efforts have been made to make the
information available on this website as authentic as possible, Indianpress365daysor any staff persons will not be responsible for any loss to
persons caused by any shortcoming, defect or inaccuracy in the
information available on website.
హైదరాబాద్, జూలై 31: రాష్ట్రాన్ని విభజించాలంటూ సీడబ్ల్యూసీ, యూపీఏ సమన్వయ కమిటీలు చెప్పేశాయి. ఇక రాష్ట్రం విడిపోవడం ఖాయమైపోయిం ది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల ప్రయోజనాలను పరిరక్షించే ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ క్రమంలో..ముందుగా హైదరాబాద్, నీరు, విద్యుత్తు వంటి ప్రధాన సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనాల్సి ఉంది. తెలుగువాళ్లు అన్నదమ్ముల్లా విడిపోవడానికి సామరస్య పూర్వక వాతావరణాన్ని కల్పించాల్సి ఉంది. ఆందోళనలు, అలజడులు రేకెత్తకుండా జాగ్రత్త పడాల్సిఉంటుంది. 'విభజన' వేళ అందరి మదిలో గిలిపెడుతున్న సమస్యలివి. ఇదే అంశం పై 'పెద్ద మనుషులు కావలెను' అన్న శీర్షికన ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ బుధవారం 'బిగ్ డిబేట్'ను నిర్వహించింది.
మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ సమన్వయకర్తగా వ్యవహరించగా.. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌తో పాటు వివిధ ప్రధాన పార్టీల నేతలు, వేదికల ప్రతినిధులు, నిపుణులు పాల్గొన్నా రు. విభజనకు అడ్డుగా ఉన్న ఒక్కో జఠిల సమస్యపై ఎండీ రాధాకృష్ణ.. అతిథులను ప్రశ్నిస్తూ చర్చను ముందుకు నడిపించారు.
విభజనలో పెద్దమనుషులు పాత్రపై.. అభిప్రాయ భేదాలు, ద్వేషాలను పక్కకు పెట్టి సామరస్య పూర్వకంగా సమస్యలను పరిష్కరించుకోవాలని సీనియర్ రాజకీయ నేత చెన్నమనేని రాజేశ్వరరావు సూచించారు. ఉమ్మడి సమస్యలపై రాజకీయ పార్టీలు..పెద్ద మనుషుల పాత్ర పోషించాలని కోరారు.
రాజకీయ పార్టీల పాత్రపై.. వ్యవస్థలోనే లోపాలున్నాయని, వాటిని సామరస్యంగా వికేంద్రీకరించుకుంటేనే తెలుగు ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంటుందని రాజేశ్వరరావు అభిప్రాయపడ్డారు. విభజన అంశం అసెంబ్లీలో చర్చకు వస్తుంది కాబట్టి..సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయడం సరికాదని నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ పేర్కొన్నారు. రాజీనామా చేయడం వల్ల తమ ప్రజల వాదనలు, మనోభావాలను తెలిపే అవకాశాన్ని కోల్పోతారని వివరించారు. రాజకీయ పార్టీలు వాస్తవాలు చెప్పాలని సీపీఐ రాష్ట్ర నేత కె. రామకృష్ణ సూచించారు.
తాము విభజనను కోరుతుండగా, సీపీఎం సమైక్యాంధ్రకు కట్టుబడిందని.. ఈ పరిస్థితుల్లో వామపక్షాలు పెద్దన్న పాత్ర పోషించడం సాధ్యం కాదని ఆయన వివరించారు. సీడబ్ల్యూసీ తీర్పు ఇచ్చేసినందున..చేసేదేం లేకపోయినా, సీమాంధ్ర ప్రాంత మనోభావాలను రాజకీయ పార్టీలుగా తాము వ్యక్తం చేస్తున్నామని మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ వివరించారు. దిగ్విజయ్.. టీఆర్ఎస్‌తో విలీనం గురించి, మంత్రి టీజీ వెంకటేశ్ 'రాజధాని' గురించి.. ఇలా ఒకేపార్టీలో ఇన్ని వాదనలు వినిపిస్తున్నప్పుడు కాంగ్రెస్ వాళ్లు రాజకీయం చేస్తున్నట్టు కాదా అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు.
హైదరాబాద్ సమస్యపై.. ఇప్పటివరకు దేశంలో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయని, వాటి విషయంలో రాజ్యాంగ పరంగా తీసుకున్న జాగ్రత్తలన్నింటినీ తెలంగాణ విషయంలోనూ తీసుకుంటారని టీఆర్ఎస్ పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. "ప్రపంచమే గ్లోబల్ విలేజ్‌గా మారిపోయింది. ఎక్కడివారో హైదరాబాద్‌కు వచ్చి నివసిస్తున్నారు. మిమ్మల్ని(సీమాం«ద్రులు) వెళ్లిపోవాలని ఎవరు చెప్పారు? వ్యాపారాలు చేసుకోవద్దని ఇక్కడ ఎవరైనా చెప్పారా? విశాల దృక్పథంతో ఈ విషయాన్ని పరిష్కరించుకోవాలి'' అని సూచించారు. ఏదో ఒక ప్రాం తాన్నే అభివృద్ది చేయడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమయిందని మంత్రి వర ప్రసాద్ అన్నారు. కేరళలో త్రివేండ్రంతో పాటు కొచ్చిన్ వంటి నగరాలు అభివృద్ధి చెందిన విషయాన్ని ప్రస్తావించారు.
హైదరాబాద్‌లోని వారందరికీ ఎలాంటి సమస్య లేకుండా చూసేందుకు రాజకీయ పార్టీలన్నీ శ్రమించాలని రాజేశ్వరరావు కోరారు. చాలా మంది సీమాంధ్ర యువకులు హైదరాబాద్‌తో అనుబంధం పెంచుకొని.. ప్లాట్లు కొనుక్కుని నివసిస్తున్నారని, ఇప్పటి పరిస్థితుల్లో తమకు భరోసా లేదని సోమిరెడ్డి పేర్కొన్నారు. మజ్లిస్ నేత ఒవైసీ సూచించినట్టు.. హైదరాబాద్‌లో ఉన్నవాళ్లకీ భరోసా ఇస్తూ చట్టం తీసుకురావాలని కోరారు. హైదరాబాద్ పాతబస్తీలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, వాటిని పట్టించుకోకపోవడం వల్లనే విభజన వాదాలు ముందుకు వస్తున్నాయని మాడభూషి శ్రీధర్ అన్నారు.
జల సమస్యలపై.. నీరే ప్రధాన సమస్య అని, దీనిని కేంద్ర జాబితాలో ఉంచితే మంచిదని.. ఎవరి వాటా వారికి వేసి చట్టం చేయాలని మంత్రి వర ప్రసాద్ సూచించారు. జలాలపై ప్రజలు ఆందోళన చెందటంలో అర్థం ఉన్నదని, బోర్డు ఉన్నా తుంగభద్ర జలాల విషయంలో ప్రతిసారీ వివాదాలు రేకెత్తుతుండటమే దీనికి కారణమని రామకృష్ణ వివరించారు. పొరుగున ఉన్న కర్ణాటకలోని ఆలమట్టి నుంచి మన రాష్ట్రానికి తాగు నీరే సరిగ్గా వదలడం లేదని సోమిరెడ్డి తెలిపారు. వట్టి బోర్డుల ప్రయోజనం లేదని గత అనుభవాలు చెబుతున్నాయని వాదించారు. జల నిబంధనలకు విరుద్ధంగా పోవడం వల్లనే లొల్లి తలెత్తుతున్నదని ఈటెల అభిప్రాయపడ్డారు. తటస్థ వ్యక్తులతో కమిటీ ఏర్పాటుచేసి పరిష్కారం కనుగొనాలని మాడభూషి శ్రీధర్ సూచించారు.
సామరస్య సాధనపై.. అణగారిన వర్గాలకు చెందిన వారిపట్ల తమకు సానుభూతి ఎప్పుడూ ఉంటుందని, తెలంగాణకు మద్దతుగా గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా ధర్నాలు జరిగాయని ఈటెల గుర్తు చేశారు. రాజధాని, నీరు అంశాలపై ముందుగా మూడు ప్రాంతాలకు చెందిన మంత్రులకు ఒక అవగాహన కల్పించాలని, అప్పుడు వారు ప్రజలను నడిపించగలుగుతారని సోమిరెడ్డి సూచించారు. పరస్పరం ఘర్షించుకోవడం కాక, రెండు రాష్ట్రాలూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి.. న్యాయంగా రావాల్సిన వాటిని రాబట్టుకోవాలని మాడభూషి శ్రీధర్ కోరారు. సమైక్యాంధ్ర ఎందుకు కోరుకుంటున్నారనేది చర్చింకుండానే విభజన నిర్ణయాన్ని తీసుకున్నారని, ఇక ముందైనా ఆంధ్రా ప్రాంతానికి భరోసా ఇచ్చే చర్యలు ఉండాలని మంత్రి వర ప్రసాద్ అభిలషించారు.