- ఆధ్యాత్మికం ముసుగులో భూ ఆక్రమణల దందా
- ఇప్పటిదాకా కబ్జా.. 520 ఎకరాలకుపైగానే..!
- దీప్తిశ్రీ నగర్‌ను బుక్కపెట్టిన సత్యవాణి, అట్లూరి సుబ్బారావు
- పార్క్, స్కూల్, కమర్షియల్ స్థలాల్లోనూ అక్రమ లే అవుట్లు
- ఆర్‌టీఐ సమాచారంతో బట్టబయలైన బండారం
- శ్రీ శివబాలయోగి మహరాజ్ ట్రస్టు పేరుతో దేవుళ్లు, హుండీలు
- సత్యవాణి ఆధీనంలో ఉన్న స్థలాలన్నీ సర్కారువే: శేరిలింగంపల్లి తహశీల్దార్ వెల్లడి
హైదరాబాద్ సెప్టెంబర్ 16 (టీ మీడియా): నోరు తెరిస్తే.. ఆధ్యాత్మికం, కాలు కదిపితే కబ్జా ఆమె స్టైల్. శివ.. శివ అంటూనే గుడితో సహా లింగాన్ని మింగే ఘనురాలు. సీమాంధ్ర నుంచి హైదరాబాద్‌కు వచ్చి వందల ఎకరాల భూమిని సంపాదించడం ఎంత వీజీనో శ్రీ శివ బాలయోగి మహరాజ్ ట్రస్టు ఓనర్ గొట్టిపాటి సత్యవాణిని అడిగితే తెలుస్తుంది. సత్యవాణి సమైక్యసభలో చెప్పిన సుద్దులకు.. అధ్యాత్మికం మాటున నిర్వహించే దందాలకు ఏమాత్రం సంబంధంలేదని ఆమె గురించి కొంత తెలుసుకున్నా అర్థమైపోతుంది. ధార్మిక క్షేత్రం మాటున సత్యవాణి అక్రమించిన సర్కారు స్థలం 520ఎకరాలపైమా సమాచారం. మియాపూర్‌లో సత్యవాణి ఆక్రమించిన స్థలంలో ఒక చెరువు ఉండేదని.. ఇందు లో గ్రామస్థులు బతుకమ్మలు కూడా వేసేవారని స్థానికులు చెబుతున్నారు.

సత్యవాణి ప్రవేశం తర్వాత ఆ స్థలంలో మియాపూర్‌వాసుపూవ్వరూ అడుగుపెట్టే పరిస్థితి లేదని.. వనభోజనాలు నిర్వహించుకునేందుకు సైతం కమ్మ సామాజిక వర్గానికి చెందినవారినే అనుమతిస్తారని వాపోతున్నారు. సత్యవాణి శిష్యురాలు సరళారాణి ఈ విషయాన్ని ‘టీ మీడియా-టీ న్యూస్’కు వెల్లడించారు. ఈ స్థలంలో ఏర్పాటుచేసిన శ్రీ శివ బాలయోగి మహరాజ్ ట్రస్టు ప్రాంగణంలో శివాలయం, సాయిబాబా మందిరం, సరస్వతి దేవాలయం, విజయదుర్గాదేవీ మందిరాలు నిర్మించారు. దేవాలయాల్లో హుండీలు ఏర్పాటు చేసి భారీగా డబ్బులు గుంజడమే లక్ష్యంగా ఆమె ట్రస్టు రోజువారీ కార్యకలాపాలు సాగుతాయనే విమర్శలున్నాయి.
దీప్తిశ్రీ నగర్‌ను బుక్కపెట్టిన సత్యవాణి, అట్లూరి: సీమాంధ్రకు చెందిన ప్రశాంత్ బిల్డర్స్, హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ సెంటర్ చైర్మన్ అట్లూరి సుబ్బారావు అండ దండలే సత్యవాణిని ఈస్థాయిలో నిలబెట్టిందని తెలుస్తున్నది. అట్లూరి చలవతోనే సత్యవాణి మియాపూర్ స్థలాన్ని కబ్జా చేసి ట్రస్టు మాటున సర్కారు భూములను బుక్కపెట్టినట్లుగా ఆరోపణలున్నాయి. మియాపూర్‌లోని సర్వే నంబర్ 100, 101లో ఉన్న దీప్తి శ్రీనగర్ కాలనీలో దీప్తి శ్రీ బిల్డింగ్ సొసైటీ 1985నుంచి 1990వరకు మూడు ఫేజ్‌లకు అనుమతులు పొందింది. అక్కడి నుంచే సత్యవాణి, అట్లూరి సుబ్బారావు కబ్జా కథ మొదలైంది. నిజమైన దీప్తిశ్రీ బిల్డింగ్ సొసైటీవాసులు ఎవరు లేకుండానే సత్యవాణి, అట్లూరి సుబ్బారావు తామే ఈ సొసైటీ పెద్దలమని నాటకం మొదలు పెట్టారు. సత్యవాణిని సొసైటీ అధ్యక్షురాలుగా అధికారులను నమ్మించి ఈమేరకు రిజిస్ట్రేషన్ చేయించా రు.
ఆ తర్వాత 1996నుంచి దీప్తిశ్రీ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షురాలి పేరుతో సత్యవాణి సొసైటీ లేఅవుట్‌ను కాంప్రహెన్సివ్ రివైజ్‌డ్ లే-అవుట్ చేసి ప్రజాప్రయోజనార్థం నిర్దేశించిన స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం మొదలు పెట్టారు. దీనికి ఉదాహరణగా ఫేజ్-1 లే అవుట్‌లో కమర్షియల్ కాంప్లెక్స్ కోసం 1.18ఎకరాల విస్తీర్ణం గల భూమిని నిజమైన దీప్తిశ్రీ బిల్డింగ్ సొసైటీ లేఅవుట్‌లో చూపించింది. ఈ స్థలంపై కన్నుపడ్డ అట్లూరి సుబ్బారావు సత్యవాణితో కలిసి ప్లాట్లుగా మార్చి అమ్మేశారు. ఆ తర్వాత కమర్షియల్ కాంప్లెక్స్‌ను పార్క్ స్థలంలోకి మార్చారు. పార్క్ కోసం కేటాయించిన 50X275 =13750చదరపు అడుగుల స్థలాన్ని అట్లూరి సుబ్బారావు సొంతం చేసుకున్నారు. అదే విధంగా ఫేజ్-2 లేఅవుట్‌లో స్కూల్ కోసం నిర్దేశించిన 5270చదరపు గజాల స్థలాన్ని మరోసారి అట్లూరి సుబ్బారావు 1500గజాలు ఆయన భార్య పద్మావతి 1500గజాలు దక్కించుకున్నారు.
పైగా స్కూల్ కోసమంటూ నిర్దేశించిన 5270చదరపు గజాల స్థలం సొసైటీ ఆధీనంలోనే ఉన్నట్లు చూపి జీహెచ్‌ఎంసీ కమిషనర్ నుంచి స్కూల్ నిర్మాణం కోసం సత్యవాణి అనుమతి పొందారు. అట్లూరి సుబ్బారావుకు, ఆయన భార్య పద్మావతికి అమ్మగా మిగిలిన 2270చదరపు గజాల స్థలాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకు స్కూల్ పేరుతో అమ్మే ప్రయత్నం జరుగుతున్నది. సత్యవాణి చేస్తున్న ఈ అక్రమాలన్నీ కాలనీ ప్రయోజనాలకు విరుద్ధమే కాకుండా ప్రభుత్వాన్ని కూడా మోసం చేయడమే అవుతుందని కాలనీవాసులు అంటున్నారు. తమకు తెలియని సొసైటీ ప్రెసిడెంట్ ఎవరా..? అని ఆర్‌టీఐ చట్టం కింద ఆరా తీస్తే సత్యవాణి అని తేలిందని కాలనీవాసులు అంటున్నారు. ఇప్పటికే పై అక్రమాలను ప్రస్తావిస్తూ వారు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు లేఖ కూడా రాశారు. కాగా, రెండు దశాబ్దాల క్రితం ఏర్పడిన దీప్తిశ్రీ నగర్ సొసైటీలో ఇప్పటివరకు ఒక్కసారికూడా ఎన్నికలు జరగలేదు.
ఆలయాల ప్రాంగణంలో ప్రకృతి చికిత్సాలయందైవాన్ని చూపించి వందల ఎకరాల స్థలాన్ని బుక్కపెట్టిన సత్యవాణి ఈ ప్రాంగణంలోనే ఓ ప్రకృతి చికిత్సాలయం, గెస్టు హౌస్‌ను ఏర్పాటు చేశారు. ఈ విషయంపై గతంలోనే అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇదే ట్రస్టులో సాగుతున్న మరో దందా నీళ్ల అమ్మకం.. ఎండాకాలంలో హోటళ్లకు, ప్రైవేటు హాస్టళ్లకు ఇక్కడినుండే నీళ్లు వెళ్తాయని స్థానికులు చెబుతున్నారు. ఫలితంగా చుట్టుపక్కల ఎన్ని బోర్లు వేసినా నీళ్లుపడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. శ్రీ శివ బాలయోగి మహరాజ్ ట్రస్టులో నాంపల్లి బాబా స్పెషల్‌గా కనిపిస్తాడు. వాస్తవానికి ఈయన ఎక్కడా ఏ ఆధ్మాత్మిక కార్యక్షికమాల్లో పాల్గొనలేదని స్థానికులు చెబుతారు. గతంలో ఈ నాంపల్లి బాబా నాంపల్లి రైల్వేస్టేషన్‌లో గంజాయి తాగుతూ తిరిగేవాడని అక్కడి స్థానికులు చెబుతుంటారు. కానీ ఈ బాబాకు సత్యవాణి గుడి కట్టించేశారు.
provides
the latest News time to time for your better entertainment , Don’t forget keep watch
this website again and again, All Daily News Papers (Eenadu, Sakshi, Andhra Jyothi, Andhra Bhoomi, Andhra Prabha, Namasthe Telangana, Vaartha, Praja Shakthi, Vishalandra, Surya) in one site, All the best my visitors
is not responsible for any inadvertent error that may have crept in the News being published on NET. The News published on net are for
the immediate information to the visitors. This does not constitute to
be a legal document. While all efforts have been made to make the
information available on this website as authentic as possible,
or any staff persons will not be responsible for any loss to
persons caused by any shortcoming, defect or inaccuracy in the
information available on website.